TTD: జులై నెలలో శ్రీవారి ఉత్సవాల జాబితా విడుదల చేసిన టీటీడీ జులై మాసంలో జరగనున్న శ్రీవారి విశేష ఉత్సవాల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ జులై 5 నుంచి 30 వరకు తొమ్మిది రోజుల్లో విశేష ఉత్సవాలు
- జులై మాసంలో జరగనున్న శ్రీవారి విశేష ఉత్సవాల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ
- జులై 5 నుంచి 30 వరకు తొమ్మిది రోజుల్లో విశేష ఉత్సవాలు
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రతి నెలా వివిధ రకాల విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా జూలై నెలలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా జూలై మాసంలో విశేష ఉత్సవాలు జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో జూలై మాసంలో జరగబోయే విశేష ఉత్సవాల షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసింది. జూలై నెలలో 5వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకూ తొమ్మిది రకాల విశేష ఉత్సవాలు జరగనున్నాయి.
**జూలై నెలలో జరగనున్న ఉత్సవాలు ఇలా ఉన్నాయి.**
* జూలై 5న పెరియాళ్వార్ శాత్తుమొర
* జూలై 6న శయన ఏకాదశి, చాతుర్మాస వ్రతారంభం
* జూలై 7న శ్రీనాథ మునుల వర్షతిరునక్షత్రం
* జూలై 10న గురు పౌర్ణమి గరుడసేవ
* జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం
* జూలై 25న తిరుమల చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
* జూలై 28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు
* జూలై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ
* జూలై 30న కల్కి జయంతి, కశ్యపు మహర్షి జయంతి
ఈ శ్రీవారి విశేష ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.